సా-ధన్
వర్గం : ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (ఎఫ్.ఐ.)
భాగస్వామ్యం యొక్క పరిధి: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సా-ధన్ (SA-DHAN) స్వయం సహాయక బృందంలోని (Self Help Group) పరిణతి చెందిన సభ్యులలో మహిళా-నేతృత్వంలోని సంస్థలను ప్రోత్సహించడానికి 22 మార్చి 2024 న చేతులు కలిపాయి. ఎంపిక చేసిన రాష్ట్రాలలో ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించాలని ఇంకా తెలియజేయబడింది.
1) ఎంపిక చేసిన రాష్ట్రాలలో మహిళా సంస్థల సామర్థ్యంపై (potential of women enterprises) 'స్కోపింగ్ నివేదిక' (scoping report) తయారీ.
2) రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ (State Rural Livelihood Mission) మరియు ప్రముఖ ఆర్థిక సంస్థల (leading financing Institutions) మధ్య భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం.
3) జోక్యం కోసం (intervention) తగిన డిజిటల్ సాధనాలను (digital tools) అభివృద్ధి చేయడానికి DAY-NRLM కు మద్దతు ఇవ్వడం.
4) DAY-NRLM భాగస్వామ్యంతో సంబంధిత వాటాదారులతో (relevant Stakeholders) వర్క్‌షాప్‌లు (workshops), సంప్రదింపులు (consultations), శిక్షణా కార్యక్రమాలను (training Programmes) నిర్వహించడం.
5) పారిశ్రామికవేత్తల (entrepreneurs) కోసం వడ్డీ రాయితీకి (interest Subvention) సంబంధించిన పథకాలను (Schemes) అభివృద్ధి చేయడం.